జగన్ ప్రెస్ మీట్ లో వీటి గురించే మాట్లాడతారా? 

జగన్ ప్రెస్ మీట్ లో వీటి గురించే మాట్లాడతారా? 

వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు.  కరోనా వైరస్ ప్రభావంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానం, కరోనా వైరస్ పై తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలను గురించి జగన్ ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేయబోతున్నారు.  తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నిన్నటి నుంచి నెలకొన్న పరిస్థితుల గురించి కూడా జగన్ మాట్లాడే అవకాశం ఉన్నది.  

అదే విధంగా ఇప్పటికే రాష్ట్రాల్లో పది పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దానిపై కూడా జగన్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఈనెలాఖరున బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నది.  బడ్జెట్ ఆమోదం పొందితేనేగాని ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసేందుకు వీలుపడదు.  అదే విధంగా రేషన్ పంపిణి విధానంపై కూడా వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  ఇక తెలుగు రాష్ట్రాల్లో  కరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్నది.  తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్ లో 10 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.