అమిత్ షాకు జగన్ లేఖ.. ఏమనంటే ?

అమిత్ షాకు జగన్ లేఖ.. ఏమనంటే ?

కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు ఏపీ సీఎం జగన్. వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు , వరదలతో తీవ్రంగా నష్టపోయామన్నారు సీఎం. 2 వేల 250 కోట్ల ఆర్థికసాయం చేయాలని కోరారు. దాదాపు 4 వేల 400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, వెంటనే వెయ్యి కోట్లు మంజూరు చేయాలని అమిత్‌షా కు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఈ నెల 9నుంచి 13వరకు కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తొమ్మిది జిల్లాల్లోని 71,800 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు లేఖలో సీఎం పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ సిబ్బంది నిర్విరామంగా పనిచేసినా 14మంది మృతి చెందినట్టు సీఎం లేఖలో తెలిపారు.