అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ళ పట్టా ఇవ్వండి : జగన్ కీలక ఆదేశాలు

అర్హత ఉన్న  ప్రతి ఒక్కరికీ ఇళ్ళ పట్టా ఇవ్వండి : జగన్ కీలక ఆదేశాలు

అనుకున్న సమయానికి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని అధికారులను ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాల పంపిణీపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని అప్పటిలోగా అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు. 29 నుంచి 30 లక్షల వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని జగన్ కు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. భూసేకరణ, పొజిటిషన్, ప్లాట్ల అభివృద్ధి పై అధికారులు దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. 

80 శాతం 85 శాతం 90 శాతం అంటూ అధికారులు లెక్కలు చెబితే తాను అంగీకరించని నూటికి నూరు శాతం పట్టాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని జగన్ సూచించారు. కోవిడ్ పరిస్థితులు తగ్గాక తానే స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తానన్న జగన్ సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇళ్ల పట్టాలు నిరాకరిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అర్హత ఉంటే తనకు ఓటు వేయని వాళ్లకు కూడా పట్టాల పంపిణీ జరగాలని అన్నారు.