నేను బాగా ఆడటానికి కారణం ధోనీనే : జడేజా

నేను బాగా ఆడటానికి కారణం ధోనీనే : జడేజా

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 13 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై మాట్లాడిన జడేజా... భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే మూడో వన్డేలో నేను బాగా ఆడానని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్తే సునాయసంగా భారీ స్కోర్ చేయవచ్చని మహీ చెప్పాడని, ఆ ఫార్మూలతోనే రాణించానన్నాడు. అయితే 152 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హార్దిక్ పాండ్యా, జడేజా ఆదుకున్నారు. విధ్వసంకర బ్యాటింగ్‌తో ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించి జట్టు స్కోర్‌ను 300 ధాటించారు. దాంతో భారత్ చివరి 10 ఓవర్లలో 110 పరుగులు చేసింది.