అందంతో కట్టిపడేస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

అందంతో కట్టిపడేస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

అనసూయ భరధ్వాజ్ ఈమె అందానికి ఎవ్వరైనా దాసోహం అనాల్సిందే. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రకారుని ముగ్దులను చేసుకుంటుుంది. ఈ భామకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అగ్రహీరోయిన్‌లను సైతం ఢీకొట్ట గలదు. తెలుగు బుల్లి తెరపై ఉన్న అందగత్తెల్లో అనసూయ టాప్‌లో ఉంటుంది. ఈ అమ్మడు కేవలం టీవీ షోలలోనే కాకుండా సినిమాల్లో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. అనసూయ ఫ్యాషన్ డ్రస్సులు వేస్తే తట్టుకోలేని కుర్రకారు ఇక అనుపాప చీర కట్టులో కనిపిస్తే వారి చిన్ని గుండెల పరిస్థితేంటో అర్థం కావట్లేదు. అయితే ఇటీవల అనసూయ ఓ షోటో షూట్‌లో పాల్గొంది. అందులో ఆమె అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవనేంతగా అందరి దృష్టి ఆకర్షించింది. నల్లని చీరలో కుర్రకారుని కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోలను అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అనసూయ వరుస సినిమాలను ఓకే చేస్తూ తన సినీ కెరీర్‌లో అంచలంచలుగా ఎదుగుతుంది. కన్నడ, తమిళ్, హిందీ భాషల్లోకీ హీరోయిన్‌ ఎంట్రీ ఇవ్వనుందట. ఈ విషయాన్ని అభిమానులకు అను పాప ఎప్పుడు క్లారీటీగా చెప్తుందో చూడాలి.