అయోధ్య రామాలయం ఏర్పాటు కోసం 28 ఏళ్లుగా ఆ మహిళ ఉపవాసం... 

అయోధ్య రామాలయం ఏర్పాటు కోసం 28 ఏళ్లుగా ఆ మహిళ ఉపవాసం... 

అయోధ్య రామాలయంలో భూమి పూజ రేపటి రోజున జరగబోతున్నది.  ఈ ఆలయం భూమి పూజకు ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే.  1992లో బాబ్రీ మసీద్ కాల్చివేత తరువాత అయోధ్యలో వివాదం నెలకొన్నది.  అప్పటి నుంచి కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి.  కాగా, గతేడాది సుప్రీం కోర్టు అయోధ్యకు సంబంధించిన తీర్పును వెలువరించింది.  ఇక ఇదిలా ఉంటె, అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ ఉపవాస దీక్షను మొదలుపెట్టింది.  ఆహారం తీసుకోకుండా కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటూ, రామనామం జపిస్తూ దీక్షను మొదలుపెట్టింది.  1992 నుంచి ఇప్పటి వరకు ఆమె ఆ దీక్షను చేస్తూనే ఉన్నది.  28 ఏళ్ళ తరువాత తన కల నిజం అవుతున్నందుకు సంతోషంగా ఉందని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ఊర్మిళ చేతుర్వేది తెలిపారు.  దీక్ష చేపట్టినప్పుడు తన వయసు 53 సంవత్సరాలుగా పేర్కొన్నారు.  అయోధ్య ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, రామాలయం నిర్మాణం జరిగే వరకు ముద్దముట్టేది లేదని అప్పట్లో ఊర్మిళ చతుర్వేద ప్రతిజ్ఞ చేశారు.  ఆగష్టు 5 వ తేదీన రామాలయం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ తరువాత దీక్షను విడుస్తానని చెప్పారు.