రివ్యూ: జాను 

రివ్యూ: జాను 

నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్ తదితరులు 

సంగీతం: గోవింద్ వసంత 

నిర్మాత: దిల్ రాజు 

దర్శకత్వం: ప్రేమ్ కుమార్ 

ఇటీవల కాలంలో తమిళంలో వచ్చిన 96 సినిమా మంచి విజయం సాధించింది.  విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ మూవీ అక్కడ సంచలన విజయం నమోదు చేసుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడంతో దిల్ రాజు ఈ సినిమా హక్కులు తీసుకొని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశారు.  శర్వానంద్, సమంతలు జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ మూవీ ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దామా.  

కథ: 

శర్వానంద్ ఓ ట్రావెల్ ఫోటోగ్రాఫర్.  ఓసారి తన స్టూడెంట్స్ తో కలిసి అనుకోకుండా పదిహేనేళ్ల క్రితం తాను చదువుకున్న స్కూల్ వద్దకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.  అప్పట్లో చదివిన బ్యాచ్ అందరిని రీ యూనియన్ చేస్తారు. ఆ బ్యాచ్ మొత్తం అక్కడికి వస్తుంది.  సమంత కూడా వస్తుంది.  స్కూల్ నుంచి సమంత... శర్వానంద్ లు ప్రేమించుకుంటారు.  అయితే, కొన్ని కారణాల వలన విడిపోతారు.  ఎందుకు విడిపోయారు... తిరిగి మరలా ప్రేమించుకున్నారా లేదా అన్నది మిగతా కథ 

విశ్లేషణ: 

మనసులోని భావాలను అంతర్లీనంగా చెప్పే అందమైన ప్రేమ కథ ఇది.  ప్రేమ అంటేనే ఫ్రెష్ గా ఉంటుంది. ప్రేమలో ఉన్న వ్యక్తులకే దానిలోని మాధుర్యం తెలుస్తుంది.  ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.  జాను కూడా అటువంటి లవ్ స్టోరీని.  స్కూల్ స్టేజీలో విడిపోయిన ఇద్దరు వ్యక్తులు రీ యూనియన్ సందర్భంగా కలుసుకొని తిరిగి వారి ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారు అనే విషయాలను ఇందులో చూపించారు.  ఒక్కమాటలో చెప్పాలి అంటే ఇది మాములు లవ్ స్టోరీనే.  కానీ, అందులోని ఫీల్ ను తెరపై చూపించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తమిళ్ లో ఎలా ఆ ఫీల్ ను చూపించారో తెలుగులో కూడా అదే ఫీల్ ను చూపించారు.  నటులు మారినా ఫీల్ మారలేదు.  అదే సినిమాకు ప్లస్ అయింది.  కాకుంటే సినిమా స్లోగా ఉండటం ఒక మైనస్.  

ప్రేమను ఎమోషనల్ జర్నీగా నడిపించడంలో సినిమా సెంటిమెంట్ పరంగా వర్కౌట్ అయ్యింది.  96 సినిమా చూడని వాళ్లకు ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుంది.  ఫస్ట్ హాఫ్ లో స్కూల్ ఏజ్ సీన్స్ బాగుంటాయి.  అదే విధంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. 

నటీనటుల పనితీరు: 

శర్వానంద్, సమంతలు సినిమాకు ప్రాణం పోశారు.  చాలా సన్నివేశాలలో సమంత అద్భుతంగా నటించి మెప్పించింది.  ఇక వెన్నెల కిషోర్ పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

సినిమాకు గోవింద్ వసంత్ ఇచ్చిన సంగీతం ప్లస్ అయ్యింది.  ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించాడు.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.  పాటలు పర్వాలేదు.  సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నది.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

స్టోరీ 

మ్యూజిక్ 

నెగెటివ్ పాయింట్స్: 

స్లో నేరేషన్ 

చివరిగా : జాను: 96 చూడని వాళ్లకు జాను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.