ప్రకాష్‌ రాజ్‌ని ఉద్దేశిస్తూ.. బండ్ల ఫైర్

ప్రకాష్‌ రాజ్‌ని ఉద్దేశిస్తూ.. బండ్ల ఫైర్

ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్‌ రాజ్‌.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ని 'ఊసరవెల్లి' అని సంభోదించిన విషయం తెలిసిందే. దానిపై తాజాగా సినీనిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ స్పందిస్తూ వరుస ట్వీట్లను సంధించాడు. 

ప్రకాష్‌ రాజ్‌ని ఉద్దేశిస్తూ…

ఎలక్షన్ టైంలో మాట్లాడటం ధర్మం కాదని రాజకీయాలు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు నేను ఒకటి మాత్రం చెప్తున్నా..

నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత నాకు తెలుసు..

పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం..

ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్…

నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్..

నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది..

నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన బిక్ష.. అని బండ్ల గణేష్‌ వరుస ట్వీట్స్‌ చేశారు.