పెళ్లాం అడిగితే చెప్పాల్సిందే...

పెళ్లాం అడిగితే చెప్పాల్సిందే...

వచ్చిన జీతం వివరాలు కట్టుకున్న భార్యకు చెప్పకుండా నాలు రాళ్లు వెనుకేసుకుంటున్నారా? గుట్టుగా దాచుకుని జల్సాలు చేస్తున్నారా? భార్య అడిగితే జీతం అయిపోయిందని బుకాయించి చిల్లరగా ఖర్చు చేస్తున్నారా? ఇంట్లో డబ్బు ఇవ్వకుండా ఫ్రెండ్స్‌తో మందు, చిందులేస్తున్నారా? ఇక ఇవ్వన్ని సాగబోవు... వచ్చిన జీతం వివరాలు భార్యకు చెప్పాల్సిందే. భర్త జీతం వివరాలను తెలుసుకోవటానికి భార్యకు హక్కు ఉందని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. సునీతా జైన్ అనే మహిళ తన భర్తపై కోర్టుకెక్కింది... నెలవారి నిర్వహణ ఖర్చులకు సరైన మోతాదులో డబ్బు ఇవ్వడంలేదంటూ ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్.కె.సేథ్, నందిత దుబేలతో కూడిన హైకోర్టు బెంచ్... భర్త జీతం వివరాలు భార్య అడిగితే చెప్పాలని తీర్పునిచ్చింది.

ప్రభుత్వ-టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌లో సీనియర్ అధికారిగా పనిచేశారు పవన్ కుమార్ జైన్... అయితే భర్తకు దూరంగా ఉంటున్న సునీతా జైన్‌కు భర్త నెలవారీ నిర్వహణను కేవలం రూ .7000 మాత్రమే ఇస్తున్నారని, తనకు తాను సంపాదించుకున్నాడని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆ తరువాత ఆమె భర్త జీతం వివరాలను తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం కింది పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో చివరికి కేంద్ర సమాచార కమిషన్ యొక్క తలుపులు తెరుచుకోగా... సునీతా జైన్‌కు అవసరమైన వివరాలను అందించడానికి బీఎస్‌ఎల్‌ఎల్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జులై 27, 2007న ఆదేశించారు. దీంతో పవన్ చైన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో వివరాలు వెళ్లడికాలేదు. అయితే సునీతా జైన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో భార్య తన భర్త యొక్క చెల్లింపు వివరాలను తెలుసుకోవటానికి హక్కు కలిగి ఉందని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.