చాలా బాధగా ఉంది: ఏబి డివిలియర్స్

చాలా బాధగా ఉంది: ఏబి డివిలియర్స్

షార్జా: సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన విషయం తెలిపిందే. అయతే ఇప్పటికి ఆర్‌సీబీ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడింది. దానిపై ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ ఏబి డివిలియర్స్ స్పందించాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో వ్రిద్దిమాన్ సాహా 39 పరుగులు, జాసన్ హోల్డర్ 26 పరుగులు చేసి జట్టులో బాగా ఆడిన ఆటగాళ్లుగా ఉన్నారు. ఎస్ఆర్‌హెచ్ విజయంలో వీరి పాత్ర చాలానే ఉంది. అయితే ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ డి విలియర్స్ వారి ఓటమి పై స్పందించాడు. ‘ఇప్పటికి ఆర్‌సీబీ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇది చాలా బాధగా ఉంది. కానీ అసలు విజయం సాధించాల్సి ఉంది. ప్రస్తుతం ప్లేఆఫ్ చేరుకోవడం మరింత కష్టం అవుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఏమైనా జరగవచ్చు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన జట్టు తరువాతి మూడు మ్యాచ్‌లు గెలవచ్చు. మా ఆటపై నమ్మకంతో పోరాడతామ’ని డివిలియర్స్ చెప్పాడు.