రివ్యూ: ఇస్మార్ట్ శంకర్

రివ్యూ: ఇస్మార్ట్ శంకర్

నటీనటులు: రామ్ పోతినేని, నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్ తదితరులు 

మ్యూజిక్: మణిశర్మ

సినిమాటోగ్రఫీ : రాజా తోట 

నిర్మాత: ఛార్మి 

దర్శకత్వం: పూరి జగన్నాథ్ 

పూరి జగన్నాథ్ కు టెంపర్ తరువాత సరైన హిట్ లేదు.  హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు.  పూరి సినిమాల్లో కథ ఉండదని, మాఫియా కథనాలను నమ్ముకొని మాత్రమే సినిమా చేస్తారని అందుకే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయని టాక్.  దీని నుంచి బయటపడేందుకు పూరి చాలా గ్యాప్ తీసుకొని ఓ కథ రాసుకున్నారు.  అదే ఇస్మార్ట్ శంకర్.  హిట్ కోసం ప్రయత్నిస్తున్న రామ్ ను హీరోగా తీసుకొని సినిమా చేశాడు.  పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.  

కథ: 

ఇస్మార్ట్ శంకర్ రామ్ హైదరాబాద్ లో జులాయి రౌడీ.  సుపారీ తీసుకొని రౌడీయిజం చేస్తుంటాడు.  ఇందులో భాగంగా ఓ డాన్ దగ్గర సుపారీ తీసుకొని మాజీ ముఖ్యమంత్రిని హత్యచేస్తాడు.  దీంతో ఇస్మార్ట్ శంకర్ కు శిక్ష పడుతుంది.  జైల్లో ఉంటాడు.  ఈ కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తుంది.  సిబిఐ అధికారి సత్యదేవ్ ను కొందరు హత్యచేస్తారు.  ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం సత్యదేవ్ వద్ద ఉంటుంది.  ఆ సమాచారాన్ని ఎలా బయటకు తీశారు..? ఎలా హత్యకేసును ఛేదించారు అన్నది కథ.  

విశ్లేషణ: 

బుర్ర మార్పిడి అనే పాయింట్ ను తీసుకొని పూరి కథను అల్లుకున్నాడు. ఈసారి కథను పక్కాగా రెడీ చేసుకొని దానికి స్క్రీన్ ప్లే ను సిద్ధం చేసుకున్నారు.  దానికి తగ్గట్టుగా డైలాగ్స్ ను కూడా ప్లాన్డ్ గా సిద్ధం చేసుకున్నాక యాక్షన్ లోకి దిగాడు.  తన ఫస్ట్ హాఫ్ లో పూరి తన మార్క్ పనితనాన్ని చాటుకున్నాడు.  ఫస్ట్ హాఫ్ వేగంగా రన్ అవుతుంది.  అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ ను పూర్తి చేశారు.  పంచ్ డైలాగులు, కామెడీని మిక్స్ చేసి అద్భుతంగా తీశాడు.  

ఫస్ట్ హాఫ్ ను వావ్ అనిపించే విధంగా తీసిన పూరి.. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చే సరికి తిరిగి ప్లాప్ పూరి ఆవహించినట్టు కనిపించాడు.  బోర్ కొట్టించే సన్నివేశాలు.. లాజిక్ లేని సీన్స్ తో విసుగెత్తించాడు.  పైగా ఒకరి మైండ్ తీసి మరొకరి పెట్టి ఇస్మార్ట్ గా కన్ఫ్యూజ్ లో పడేశాడు.  ఫస్ట్ హాఫ్ లో చూపించిన పనితనం సెకండ్ హాఫ్ లో కూడా చూపించి ఉంటె సినిమా మరోలా ఉండేది.  

నటీనటుల పనితనం: 

ఇస్మార్ట్ శంకర్ గా రామ్ ఒదిగిపోయి నటించాడు.  చాలా చలాకీగా కనిపించి హంగామా చేశాడు.  ప్రియురాలిగా నభా నటేష్ మెప్పించగా, నిధి అగర్వాల్ అందాలతో చంపేసింది.  మిగతా నటీనటులు తమ పాత్ర మేరకు మెప్పించారు.  

సాంకేతిక విశ్లేషణ: 

పూరి జగన్నాధ్ చాలా కాలం కష్టపడి తయారు చేసుకున్న కథ.  ఫలితం సినిమాలో కనిపించింది.  కాకపోతే సెకండ్ హాఫ్ లో కూడా అదే జోష్ ను చూపించి ఉంటె ఇంకా బాగుండేది.  మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.  సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పాలి.  

పాజిటివ్ పాయింట్స్: 

ఫస్ట్ హాఫ్ 

స్క్రీన్ ప్లే 

నటీనటులు 

మ్యూజిక్ 

మైనస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ 

చివరిగా: ఇస్మార్ట్ శంకర్ - స్మార్ట్ గా మెప్పించాడు