రామ మందిర నిర్మాణ పూజ రోజే ఉగ్ర‌దాడి..!?

రామ మందిర నిర్మాణ పూజ రోజే ఉగ్ర‌దాడి..!?

సుప్రీంకోర్టు తీర్పు త‌ర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి వేగంగా అడుగులు ప‌డుతున్నాయి.. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విరాళాలు కూడా వ‌స్తున్నాయి.. ఆగ‌స్టు 5వ తేదీన అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.. అయితే.. రామ మందిరానికి భూమిపూజ నిర్వ‌హించే రోజునే  ఉగ్ర‌దాడికి ప్లాన్ చేస్తున్నార‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రించాయి.. అలాగే.. స్వాతంత్య్ర దినోత్సవ (ఆగ‌స్టు 15)  వేడుక‌ల‌ను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాయి.. గ‌త ఏడాది ఆగస్టు 5వ తేదీనే ఆర్టికల్‌ 370 కింద కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దుచేసింది కేంద్రం.. అయితే. అదే రోజు అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమంలో దాడుల‌కు పాల్ప‌డేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్ఐ) ప్లాన్ చేసింద‌ని.. ఇందు కోసం లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించార‌ని హెచ్చ‌రిస్తున్నాయి నిఘా వ‌ర్గాలు.