ఆ తర్వాత 2-3 వారలు గర్ల్‌ఫ్రెండ్ తో...

ఆ తర్వాత 2-3 వారలు గర్ల్‌ఫ్రెండ్ తో...

భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గురించి అందరికి తెలుసు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే పరిమితమైన ఇషాంత్ ఇంతకముందు పరిమిత ఓవర్ల  క్రికెట్ లో కూడా ఆడాడు. అప్పుడు 2013లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ తో మొహాలి స్టేడియం లో మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ధోని(139*) తో రాణించడంతో నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్ కు విజయం సాధించాలంటే చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి. ఆ సమయం లో ఇషాంత్ శర్మ వేసిన ఓవర్లో వరుసగా 4, 6, 6, 6, 2, 6 తో ఏకంగా 30 పరుగులు చేసాడు ఆసీస్ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్. దాంతో ఆసీస్ కు చివరి 2 ఓవర్లలో 14 పరుగులు కావాల్సి ఉండగా మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఫాల్కనర్ తన జట్టుకు విజయం అందించాడు. 

అయితే ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో దారుణమైన తన ఓవర్ గురించి అలాగే ఆ తర్వాత తాను చేసిన పనుల గురించి చెప్పాడు ఇషాంత్ శర్మ. ''ఆ మ్యాచ్‌ నా కెరియర్ లో టర్నింగ్ పాయింట్. నేను చేసిన ఆ పనిని దేశ ద్రోహం అని అనుకున్నాను. ఇక ఆ బాధను మర్చి పోవడానికి ఒక 2-3 వారాలు ఎవరితో మాట్లాడలేదు. ఆ సమయం మొత్తం కేవలం నా గర్ల్‌ఫ్రెండ్ తో మాత్రమే ఫోన్ మాట్లాడాను. అలా ఆమెతో మాట్లాడుతూ ఏడ్చాను కూడా. మ్యాచ్ పోయిన కాడినుండి సరిగ్గా తినలేదు. ఒకవేళ టీవీ పెడితే మొత్తం అని ఛానల్స్ లో నాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అవి చూస్తే నాకు ఇంకా బాధ అనిపించేది'' అంటూ ఇషాంత్ వివరించాడు.