ఇషాంత్ మ్యాజిక్.. పట్టుబిగించిన భారత్..

ఇషాంత్ మ్యాజిక్.. పట్టుబిగించిన భారత్..

టీ-20, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌పై కూడా కన్నేసింది. తొలి టెస్టులో మొదటి రోజు భారత్ ఆరంభంలో తబడినా ఆ తర్వాత పుంజుకుంది.. రెండో రోజు కూడా బ్యాట్స్‌మన్లు రాణించడంతో 297 పరుగుల చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు చుక్కులు చూపించారు భారత బౌలర్లు.. ముఖ్యమంగా ఇషాంత్ శర్మ 42 పరుగులు ఇచ్చి ఐదు కీలకమైన వికెట్లు పడగొట్టడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది విండీస్. ప్రస్తుతం 108 పరుగుల ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది.  

మొదట తబడినా భారత్.. తర్వాత రహానె పోరాటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఇక రెండో జడేజా 58, రోజు పంత్‌ 24 రాణించగా, ఇషాంత్‌ 19 బుమ్రా 4 (నాటౌట్‌)గా నిలవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్ ప్రారంభిచిన తక్కువ పరుగులు వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీ బ్రేక్‌ సమయానికి విండీస్‌ 82/3తో కాస్త మెరుగ్గానే కనిపించినా.. ఆ తర్వాత షై హోప్‌, హెట్‌మైయర్‌ జోడీ మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ, ఇషాంత్ వారికి అవకాశం ఇవ్వలేదు. తక్కువ పరుగుల వ్యవధిలో వీరిని ఔట్‌ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్‌ హోల్డర్‌(10), కమిన్స్ ఉన్నారు.