మరో టెస్ట్ ఆడితే వంద టెస్ట్‌ల క్లబ్‌లోకి ఇషాంత్...
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో 300 వికెట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అతడిని మరో రికార్డు ఊరిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న పింక్ బాల్ టెస్ట్ ఇషాంత్‌కు 100వ టెస్ట్ కానుంది. దీంతో టీమిండియా తరఫున ఈ ఫీట్ సాధించిన రెండో ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇంతకు ముందు టీమిండియా నుంచి 100 టెస్టులు ఆడిన ఫాస్ట్ బౌలర్‌గా కపిల్‌దేవ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే ఇషాంత్ కన్నా ముందు జహీర్ ఖాన్ 92, జవగళ్ శ్రీనాథ్ 67 టెస్ట్ మ్యాచులు ఆడారు. ఇక ఇప్పటి వరకు 99 మ్యాచుల్లో ఆడి 302 వికెట్లు తీసుకున్నాడు ఇషాంత్ శర్మ.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)