మరోసారి 'ప్రేమ కావాలి' అంటున్న ఇషా చావ్లా!

మరోసారి 'ప్రేమ కావాలి' అంటున్న ఇషా చావ్లా!

'ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలోనూ నటించింది. సునీల్ సరసన 'పూలరంగడు' , 'మిస్టర్ పెళ్ళికొడుకు' అనే రెండు చిత్రాలలో నాయికగా చేసింది. కాస్తంత గ్యాప్ తర్వాత ఇప్పుడీ భామ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.  తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ మీడియా ముందుకొచ్చింది. తెలుగులో రెండు సినిమాలు కమిట్ అయ్యానని, ఓ ఛానెల్ కోసం స్పెషల్ షో కూడా చేయబోతున్నానని ఇషా చావ్లా చెబుతోంది.