క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిన హాట్ బ్యూటీ

క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిన హాట్ బ్యూటీ

ఓ హీరోయిన్ తనను మోసం చేసిందంటూ ఓ క్యాబ్ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేసాడు. గోవా వరకు కిరాయి మాట్లాడుకొని డబ్బులు ఎగ్గొటేసిందని సదరు క్యాబ్ డ్రైవర్ చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే రాఘవ  రాజు అనే డ్రైవర్ నటి ముమైత్ ఖాన్ తనకు డబ్బులు ఎగ్గొటిందని ఆవేదన వ్యక్తం చేసాడు. నాలుగు రోజులకు గోవా కు హైదరాబాద్ నుంచి క్యాబ్ ను మాట్లాడుకుంది ముమైత్. కానీ ఏడూ రోజులు డ్రైవర్ ను తనతో తిప్పుకుంది. కిరాయి ఇవ్వకపోగా టోల్ గెట్ బిల్లులు , డీజిల్ అన్ని తానే స్వయంగా పెట్టుకున్నాడు రాజు. చివరకు అకామిడేషన్  గురించి కూడా ముమైత్ పట్టించుకోలేదట. అయితే అంతా కలిపి చివరిలో ఇస్తుందేమో అనుకున్న రాజు తన దగ్గర ఉన్నడబ్బుల తో 8 రోజులు గడిపాడట . మొత్తం తనకు 15000 బిల్ అయిందని, కానీ ముమైత్ మాత్రం డబ్బు ఇవ్వలేదని వాపోయాడు. ఈ ఘటన పై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తుంది. మరో డ్రైవర్ కు ఇలా జరగకూడదని రాజు అంటున్నాడు. టాలీవుడ్ లో కోలీవుడ్ లో ముమైత్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే . ఐటమ్ సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముమైత్ . ఈ అమ్మడు ఇలా క్యాబ్ డ్రైవర్ పొట్టగొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .  ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి  దీనిపై ముమైత్ ఖాన్ స్పందిస్తుందేమో చూడాలి.