జూన్ లో లాక్ డౌన్ ఎలా ఉండబోతుంది...?

జూన్ లో లాక్ డౌన్ ఎలా ఉండబోతుంది...?

లాక్ డౌన్ 4.0 మే 31 వ తేదీతో ముగుస్తుంది.  లాక్ డౌన్ 5 ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.  ఎందుకంటే ఇప్పటికే దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది.  1.50 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.  మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నది.  లాక్ డౌన్ 4 సడలింపులు ఇచ్చినప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్ డౌన్ 5 కూడా ఉండబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.  

లాక్ డౌన్ 5 ఉంటె ఎలా ఉంటుంది.  ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంటుంది అన్నది తెలియాలి.  లాక్ డౌన్ 4 లో కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చి వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చింది.  రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ ఏరియాలను గురించే మార్చే అధికారం రాష్ట్రాలకు ఇచ్చింది.  ఇక మే 25 నుంచి దేశీయంగా విమాన సర్వీసులు రన్ చేస్తున్నారు.  జూన్ 1 నుంచి రైళ్లు కూడా తిరగబోతున్నాయి.  ఢిల్లీలో మెట్రో సర్వీసులు నడిపేందుకు ఢిల్లీ మెట్రో సిద్ధం అవుతున్నది.  కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న సమయం, పైగా జూన్ జులై నెలల్లో ఇండియాలో కరోనా పీక్ దశకు వెళ్తుందని ఎయిమ్స్  తెలియజేసిన సంగతి కూడా తెలిసిందే.  ఇలాంటి సమయంలో ఇండియాలో లాక్ డౌన్ 5 పెట్టకుండా పూర్తిగా ఎత్తేస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.  మరి లాక్ డౌన్ 5 ఎలా ఉండబోతుంది ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉన్నది అనే విషయాలు ఈ రెండు మూడు రోజుల్లోనే తెలుస్తుంది.