ఇరాన్ కు చెందిన ఒలంపిక్ విజేతకు కరోనా... 

ఇరాన్ కు చెందిన ఒలంపిక్ విజేతకు కరోనా... 

ఇరాన్  డిస్కస్ త్రోవర్ "ఎహ్సాన్ హడాడి" కి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అయితే హడాడి 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత మరియు 2011 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు టైక్వాండో కాకుండా ఇతర రంగాలలో ఇరాన్ కొరకు ఒలింపిక్ పతకం సాధించిన మొదటి అథ్లెట్ ఎహ్సాన్ హదాది నిలిచాడు. ఆసియాలో పొడవైన డిస్కస్ త్రో (69.32 మీ) లో ప్రస్తుత రికార్డ్ కూడా ఎహ్సాన్ పేరు మీదే ఉంది. కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఎహ్సాన్ స్వీయ గృహ నిర్బంధం లోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఇరాన్ అథ్లెటిక్ ఫెడరేషన్ యొక్క వైద్యుడు అధికారికంగా తెలియజేసారు. ప్రపంచవ్యాప్తంగా 30,000 మందికి పైగా ప్రాణాలు తీసిన మరియు 195 కు  పైగా దేశాలలో వ్యాపించిన కరోనావైరస్ కారణంగా అత్యంత నష్టపోయిన దేశాలలో ఇరాన్ ఒకటి. ఇరాన్‌లో కరోనా  మరణాల సంఖ్య 2.517 గా నమోదయ్యాయి. ఆ దేశంలో 35,000 మందికి పైగా కరోనా బారిన పడ్డారు.