అంత‌ర్జాతీయ రెజ్లర్‌కి ఉరిశిక్ష‌..!

 అంత‌ర్జాతీయ రెజ్లర్‌కి ఉరిశిక్ష‌..!

కఠిన శిక్షలు అమలు చేయడంలో సౌదీ దేశాలు పెట్టింది పేరు. ఇక తాజాగా ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ రెజ్లర్ కు మరణశిక్ష విధిస్తు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు చెందిన అంత‌ర్జాతీయ స్థాయి రెజ్లర్‌ నవీద్‌ అఫ్కారీ (27) ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో పాల్గొని ఓ వాచ్మెన్ మృతికి కారణమయ్యాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఇరాన్ అత్యున్నత న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇరాన్ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పూర్తిగా ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ విషయంపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 వేల మంది అథ్లెట్లు ఇరాన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కూడా నవీద్‌కు క్షమాభిక్ష పెట్టాల‌ని కోరాడు. దీనిపై  రెజ్లర్‌ నవీద్‌ అఫ్కారీ ఓ వీడియోను విడుదల చేసాడు. అందులో   ‘నాకు మరణశిక్ష అమలు చేస్తే మీకో విషయం తెలియ‌జేయాల‌నుకుంటున్నా. స్వశక్తిపై పోరాటం చేయాలనుకుంటున్న వ్యక్తి ప్రాణాలు తీశారు’ అంటూ పేర్కొన్నాడు.