ఇజ్రాయిల్‌కు ఇరాన్ వార్నంగ్

ఇజ్రాయిల్‌కు ఇరాన్ వార్నంగ్

టెహ్రాన్: ఇజ్రాయిల్, యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. తనను తాను కాపాడుకునే హక్కు ఉందని అంది. అయితే ఈ వార్నింగ్‌లు దేశంలోని న్యూక్లియర్ శాస్త్రవేత్త హత్య తరువాత ఇరాన్ మొదలుపెట్టింది. ఇజ్రాయిల్, యూఎస్ సాహసోపేత పద్దతుల కారణంగానే ఇరాన్ ఆ ఇరు దేశాలను హెచ్చరించింది. అంతేకాకుండా యూఎన్ సెక్రటరీ జనరల్‌కు ఇరాన్ అంబాసిడర్ మాజిద్ తష్క్ రావంచి ఓ లేఖరాశారు. అందులో ఈ విషయాలను పొందుపరిచారు. ‘నా దేశానికి విరుద్దంగా ఎటువంటి సాహస కృత్యాలకు పాల్పడినా సహించేది లేదు. యూఎన్, ఇజ్రాయిల్ తమతమ హద్దులు ఎరిగి ప్రవర్తిస్తే బాగుంటుంది. తన దేశ ప్రజలను, వారి నివాసాలను కాపాడుకునేందుకు ఇరాన్ ఏమిచేయడానికైనా వెనుకాడదు. మమ్మల్ని మేము కాపాడుకునేందుకు పూర్తి హక్కులు ఉన్నాయ’ని ఆ లేఖలో రావంచి రాశారు. మా పరిశోధన-ఆవిష్కరణల సంస్థ అధికారి, న్యూక్లియర్ శాస్త్రవేత్త మోహ్‌సేన్ హత్యకు గురయ్యాడని, దీనికి ఇజ్రాయిలే కారణంగా ఇరాన్ పేర్కొంది.