మరో రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి...కరోనాతో కాదు...

మరో రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి...కరోనాతో కాదు...

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ 2016లో అధికారంలోకి వచ్చిన తరువాత అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు.  ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధించారు.  ట్రంప్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇరాన్ ను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాడు.  అంతేకాదు, ఈ ఏడాది జనవరిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమానిని బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ లో హతమార్చారు.  దీంతో ఇరాన్ అమెరికాపై మండిపడింది.  ఇరాక్ లోని అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులు చేసింది.  ఇక ఇదిలా ఉంటె, ఇటీవలే ఇరాన్ పై దాడి చేయడానికి ట్రంప్ ప్లాన్ వేశారని, యూఎస్ అధికారులు వారించడంతో దానిని విరమించుకున్నారని వార్తలు వచ్చాయి.  ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు జాగ్రత్తగా ఉండాలని, అమెరికాను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చెయ్యొద్దని ఇరాన్ తన మిత్రదేశాలను హెచ్చరించింది.  జో బైడెన్ అణు ఒప్పందానికి, ఇరాన్ తో చర్చలకు సానూకూలంగా ఉన్నారని ఇరాన్ అధికారులు చెప్తున్నారు.