పాక్ పై  సర్జికల్ స్ట్రైక్...బందీగా ఉన్న సైనికులు విడుదల... 

పాక్ పై  సర్జికల్ స్ట్రైక్...బందీగా ఉన్న సైనికులు విడుదల... 

పాక్ పై ఇండియా అనేకమార్లు సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియా కాకుండా  మరొక దేశం కూడా పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేసింది.  ఆ దేశం ఇరాన్.  ఇరాన్ కు చెందిన ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.   గత రెండున్నర ఏళ్లుగా ఇరాన్ సైనికులు ఇద్దరు పాక్ ప్రేరేపిత  ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ జైష్ ఉల్ అదుల్ చెరలో ఉన్నారు.  వారిని విడిపించేందుకు ఇరాన్ సైనికులు ఈ సర్జికల్ స్ట్రైక్స్ ను చేపట్టారు.  పాక్ ఆర్మీకి ఏ మాత్రం క్లూ దొరక్కుండా ఈ ఆపరేషన్ ను ముగించారు.  ఫిబ్రవరి 2 వ తేదీన ఈ ఆపరేషన్ చేపట్టినట్టు ఇరాన్  సైన్యం ప్రకటించింది.  పాక్ లోని ఇరాన్ ఇంటిలిజెన్స్  విభాగం అందించిన సమాచారం మేరకు ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది.