నెటిజన్లపై స్టార్ హీరో కూతురు ఫైర్

నెటిజన్లపై స్టార్ హీరో కూతురు ఫైర్

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ముద్దుల తనయ ఐరా ఖాన్‌ నెటిజన్ల పైన ఫైర్ అయ్యింది. తాను నాలుగేళ్లుగా డ్రిపెషన్‌లో ఉన్నానని, వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నానని ఐరా ఖాన్‌ ఇటీవల వీడియో రూపంలో ఓ పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఐరా ఖాన్ మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. “హాయ్.. నేను నిరాశకు గురయ్యాను. నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలకు పైగా ఈ వేదనతో ఉన్నాను. నేను వైద్యుడి వద్దకు వెళుతున్నా. వైద్యం పరంగానూ నిరాశకు గురయ్యాను. నేను ఇప్పుడు బెటరవుతున్నా. సంవత్సరానికి పైగా నేను మానసిక ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. కాని ఏం చేయాలో నాకు తెలియదు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రయాణంలోకి .. నాదైన జర్నీలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ఏం జరుగుతుందో చూడండి." అంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో పై కొందరు ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టానుసారం ద్వేషపూరిత వ్యాఖ్యలతో దురుసుగా వ్యవహరించారు.మానసిక ఆరోగ్యానికి సంబంధించిన నా పోస్ట్ల కు మీరు ద్వేషపూరితంగా వ్యాఖ్యానిస్తే.. నేను మీ వ్యాఖ్యను తొలగిస్తాను. మీరు దీన్ని మళ్ళీ చేస్తే.. నా పోస్ట్ లను మీరు చూడలేరు. అదే వ్యక్తి మళ్లీ అలాగే కామెంట్లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది .