ఏపీలో 20మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో 20మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో స్థానిక ఎన్నికలకు ముందుగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకేసారి 20 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీలతో పాటు మరికొందరికి ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్కే మీనాకు అదనపు డీజీగా ప్రమోషన్ ఇస్తూనే విశాఖ సీపీగా కొనసాంచారు. అటు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా హరీశ్‌కుమార్‌ గుప్తాను నియమించారు. లీగల్‌ ఐజీగా పి.హరికుమార్‌, ఎస్‌ఐబీ చీఫ్‌గా సి.హెచ్‌. శ్రీకాంత్‌, మెరైన్‌ పోలీస్‌ చీఫ్‌గా ఎ.ఎస్‌.ఖాన్‌లకు బాధ్యతలు అప్పగించారు. గుంటూరు రేంజ్‌ ఐజీగా జె.ప్రభాకర్‌రావు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

ఇటు ప్రొవిజన్‌ లాజిస్టిక్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీగా రఘురామిరెడ్డి, ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్‌లను నియమించారు. ఇంటెలిజెన్స్‌ డీఐజీగా విజయ్‌కుమార్‌, సీఐడీ డీఐజీగా హరికృష్ణ, ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌గా ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఏలూరు రేంజ్‌ డీఐజీగా కె.వి. మోహన్‌రావులకు చోటు కల్పించారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీగా రామకృష్ణ, నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్‌ సునీల్‌, ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి.కృష్ణారావు, ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలిలను నియమించారు.