ముంబై ఇండియన్స్ ఆశను తుంచేసిన ఢిల్లీ.. 

ముంబై ఇండియన్స్ ఆశను తుంచేసిన ఢిల్లీ.. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌  దశలోనే ముగిసింది. ఈరోజు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన అమీతుమీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలగింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేస్ నుంచి వైదొలిగిన తొలి జట్టు ఢిల్లీ.. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ ను నిలువునా ముంచేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆసక్తికర పోరులో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ ఆశ అడియాశగానే మిగిలిపోయింది.  

రాజస్తాన్‌ టార్గెట్ 175 పరుగులను ఛేదించే క్రమంలో ముంబై.. మొదట్లోనే సూర్యకుమార్‌ యాదవ్‌(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఎవిన్‌ లూయిస్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌(5), పొలార్డ్‌(7), రోహిత్‌ శర్మ(13), కృనాల్‌ పాండ్యా(4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో ముంబై 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా(27) కాసేపు మెరుపులు మెరిపించి ఏడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇక చివర్లో బెన్‌ కట్టింగ్‌(37‌) ఎంత పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి వికెట్‌గా బూమ్రా ఔట్‌ కావడంతో ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది.