హోటళ్లు వద్దు.. రిసార్టులు ముద్దు అంటున్న ఐపీఎల్ ఆటగాళ్లు.. 

హోటళ్లు వద్దు.. రిసార్టులు ముద్దు అంటున్న ఐపీఎల్ ఆటగాళ్లు.. 

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరుగుతుంది. దాని కోసం 8 జట్లు మొత్తం ఒక్కేసారి అక్కడికి చార్టెడ్ ఫ్లయిట్స్  లో బయలుదేరనున్నాయి. యూఏఈ కి చేరుకున్న తర్వాత మాములుగా ఆటగాళ్లను హోటళ్లలో ఉంచుతారు. కానీ ఇప్పుడు మాత్రం తమకు హోటళ్లు కాకుండా రిసార్టులు కావాలని ఆటగాళ్లు సంబంధిత ఫ్రాంఛైజీలను కోరుతున్నారట. ఎందుకంటే హోటళ్లలో కరోనా బారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి తమకు రిసార్టులు కావాలని అంటున్నట్లు సమాచారం. ఇక ఫ్రాంఛైజీలు కూడా అదే కరెక్ట్ అని భావించి ఐపీఎల్ జరగనున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలకు దగ్గరగా తమ ఆటగాళ్లను ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఐపీఎల్ సమయంలో ఒక్క కరోనా పాజిటివ్ వస్తే చాలు లీగ్ మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇక బీసీసీఐ మాత్రం ఇప్పుడు వివో తన హక్కులను వదులుకోవడంతో ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్ వేటలో ఉంది.