ఐపీఎల్ 2020 : 10 సెకండ్లకు 10 లక్షలు...

ఐపీఎల్ 2020 : 10 సెకండ్లకు 10 లక్షలు...

ఈ ఏడాది మార్చి 29 న జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఐపీఎల్ ను దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబరు 19 న ఈ టోర్నీని ప్రారంభించి నవంబరు 10 న ముగించేలా బీసీసీఐ షెడ్యూల్‌ రూపొందించింది. ఇక ఈ టోర్నీ ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్‌స్పోర్ట్స్‌ ఈ ఐపీఎల్ 2020 ని వీలైనంత సొమ్ము చేసుకోవాలని చూస్తుంది. అయితే కరోనా కారణంగా వాయిదా తర్వాతి నుండి ఐపీఎల్ ప్రతిరోజు వార్తలో నిలుస్తూ వచ్చింది. దాంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్ కు స్పెషల్ గా ప్రచారం చేయాల్సిన అవసరం బీసీసీఐ కి గాని స్టార్‌స్పోర్ట్స్‌ కు గాని రాలేదు. దాదాపు 4 నెలల వాయిదా తర్వాత జరుగుతున్న ఐపీఎల్ పైనే అందరి దృష్టి ఉంది. కాబట్టి ఈ ఐపీఎల్ మ్యాచ్ ల మద్య వచ్చే యాడ్స్ కు స్టార్‌స్పోర్ట్స్‌ విపరీతంగా వసూల్ చేస్తుంది అని సమాచారం. గత 12 సీజన్ల కంటే అత్యధికంగా కేవలం 10 సెకండ్ల యాడ్ కు 10 లక్షలు తీసుకుంటుంది. ఇక 51 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్ లు ఉంటాయి. అందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతాయి. అంటే ఈ 13 వ సీజన్ లో స్టార్‌స్పోర్ట్స్‌ భారీగా బాధనుంది అని తెలుస్తుంది.