ఐపీఎల్ వేలం నిబంధనలు...

ఐపీఎల్ వేలం నిబంధనలు...
  • బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి ప్రకారం.. ఫ్రాంచైజీలు తమ దగ్గర ఉన్న మొత్తంలో కనీసం 75 శాతం ఆటగాళ్ల కొనుగోలు కోసం వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫ్రాంచైజీ ఈ మొత్తాన్ని ఉపయోగించుకోకుంటే మిగిలిన డబ్బును బీసీసీఐ జప్పు చేస్తుంది.
  • రైట్‌ టు మ్యాచ్‌ కార్డ్‌ నిబంధనను 2018 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని.. వేలంపాట జరుగుతోన్న సమయంలో తమ జట్టులోని ప్లేయర్‌ను నిలుపుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతోంది మినీ వేలం కావడంతో ఆటగాడిని తమ జట్టులోనే నిలుపుకోవడానికి ఫ్రాంచైజీలు RTMను ఉపయోగించుకోలేవు.
  • ఫ్రాంచైజీల బలం 25 మంది ఆటగాళ్లను మించకూడదు.. 18 కంటే తక్కువ ఉండకూడదు.
  • జట్టులో క్యాప్‌, అన్‌ క్యాప్‌డ్‌తో సహా భారత ఆటగాళ్లను కనీసం 17, అత్యధికంగా 25 మంది ఉండేలా చూసుకోవాలి.
  • ఐపీఎల్‌ జట్టులో అత్యధికంగా ఎనిమిది మంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండొచ్చు.
  • ప్రస్తుతం చెన్నై వేదికగా జరుగనున్నది మిని వేలంపాట. ప్రతీ మూడేళ్లకొకసారి మెగా వేలంపాట జరుగుతుంది. ఈ మూడేళ్ల మధ్యలో మిని వేలంపాట జరుగుతుంది. మెగా వేలంపాటలో ఫ్రాంచైజీలు కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే నిలుపుకోగలవు.. కానీ మినీ వేలంలో ఇలాంటి పరిమితులు ఏమీ ఉండవు.