వచ్చే ఏడాది ఐపీఎల్ లో భారీ మార్పులు...?

వచ్చే ఏడాది ఐపీఎల్ లో భారీ మార్పులు...?

కరోనా కారణంగా జరుగుతుందా.. లేదా అనుకున్న ఐపీఎల్‌-2020 సీజన్‌ యూఏఈ వేదికగా ఎటువంటి సమస్య లేకుండా ముగిసింది. దాంతో ఇప్పుడు ఆయా ఫ్రాంచైజీల దృష్టంతా 2021 సీజన్‌ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే 14వ సీజన్‌లో భారీ మార్పులు కనిపించబోతున్నాయి. ఇప్పటికే లీగ్‌లో తొమ్మిదో జట్టును కూడా చేర్చబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మెగా వేలం నిర్వహించక తప్పదు. చాలా జట్లకు తమ బృందాన్ని మరింత పటిష్టపర్చుకునే దిశగా ఈ వేలం ఉపయోగపడుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా నిబంధనల్లోనూ పలు మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇందులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాలనే ప్రతిపాదన అతి ముఖ్యమైనది. ప్రస్తుతం తుది 11 మంది ఆటగాళ్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ కొంతకాలంగా ఆయా ఫ్రాంచైజీలు ఈ విషయంలో సడలింపులు ఉండాలని కోరుతున్నాయి. తాజాగా కొత్త జట్టు రాబోతుందనే ప్రచార నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఈ డిమాండ్ బీసీసీఐ ముందు గట్టిగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్‌ జట్ల సంఖ్య 8కి బదులుగా 9-10 ఉంటే ఇప్పటిలా రౌండ్‌ రాబిన్‌లో కాకుండా రెండు గ్రూపులుగా వరల్డ్ కప్ ఫార్మాట్‌లో ఆడించే అవకాశం ఉంటుంది.