ఎన్ని విమర్శలు వచ్చినా ఆగని అంపైర్ తప్పిదాలు...

ఎన్ని విమర్శలు వచ్చినా ఆగని అంపైర్ తప్పిదాలు...

ఎన్ని విమర్శలు వస్తున్న ఐపీఎల్ లో అంపైర్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఐపీఎల్ లో నో బాల్స్ విషయం లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ ఏడాది ఐపీఎల్ లో టీవీ అంపైర్ నిర్ణయించే బాధ్యతలు తీసుకున్నాడు. అయిన అంపైర్లు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే షాట్ రన్ నిర్ణయం పై వివాదాలు వస్తుండటంతో మళ్ళీ చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ లో కూడా మరో తప్పు చేసారు అంపైర్లు. ఐపీఎల్ 2020 లో రెండో మ్యాచ్ లో అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓడిపోయింది. దాంతో ఈ విషయం పై పంజాబ్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ పాలక మండలికి ఫిర్యాదు చేసింది. ఇక ఆ తర్వాత మళ్ళీ చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ లో కూడా అంపైరింగ్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీపక్ చాహర్ వేసిన 18.5 వ బంతికి టామ్ కుర్రాన్ ను అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. కానీ ఆ తర్వాత కుర్రాన్ మాత్రం అక్కడినుండి వెళ్ళలేదు. దాంతో తన నిర్ణయం పై అనుమానం వచ్చిన అంపైర్ మరో ఫిల్డ్ అంపైర్ తో చర్చించి టీవీ అంపైర్ ను అడగ్గా ధోనికి కోపం వచ్చింది. ఓసారి నిర్ణయం ప్రకటించిన తర్వాత మళ్ళీ దాని పై చర్చ ఏంటి అని ప్రశ్నించాడు. ఈ సమయంలో కుర్రాన్ నాట్ ఔట్ గా తేలింది. అయితే టాప్ లీగ్ అయిన ఐపీఎల్ ఇలాంటి తప్పిదాలు జరగడం ఏంటి అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.