ఐపీఎల్ 2020: ముంబై ఇండియన్స్ టార్గెట్ 163 రన్స్... 

ఐపీఎల్ 2020: ముంబై ఇండియన్స్ టార్గెట్ 163 రన్స్... 

ఐపీఎల్ 2020 మ్యాచ్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతున్నది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  ధావన్ 69 పరుగులతో నాటౌట్ గా నిలవగా, శ్రేయాస్ అయ్యర్ 42 పరుగులు చేయడంతో ఢిల్లీ జట్టు 162 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు తాజా సమాచారం ప్రకారం 4 ఓవర్లలో 24 పరుగులు చేసింది.