నేడు మరో రసవత్తర పోరు.. రోహిత్ ఆడే అవకాశం ?

నేడు మరో రసవత్తర పోరు.. రోహిత్ ఆడే అవకాశం ?

ఐపిఎల్‌ సీజన్‌ 13లో భాగంగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు 11 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేట్‌తో ముంబై అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరు రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు అధికారికంగా ప్లేఆఫ్స్‌ కు అర్హత పొందుతారు. ఈ లీగ్‌లో ఇది వరకే ఒకసారి ఈ రెండు జట్లు తలపడగా సూపర్‌ ఓవర్‌ రూపంలో బెంగళూరును విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై తహతహలాడుతోంది. తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌‌కు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడం.. సోమవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడంతో రోహిత్ శర్మ ఆడటం ఆసక్తినెలకొంది. ఇక బెంగళూరు గతంలో ఎన్నడూలేని విధంగా విజయాలు సాదిస్తుండటం ఆ జట్టుకు శుభపరిణామం. అరోన్‌ ఫించ్‌, యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌, ఎబి డివిలియర్స్‌ పరుగులపంట పండిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో వారి సక్సెస్‌పై జట్టు విజయం ఆధారపడి ఉంది.