మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ నేడు.. ఓడిన జట్టు..?

మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ నేడు.. ఓడిన జట్టు..?

ఐపిఎల్‌ 2020లో మరో ఆసక్తికర మ్యాచ్‌ ఇంకాసేపట్లో ఆరంభం కాబోతోంది. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య కీలక మ్యాచ్‌ ఇది. ఏ జట్టు గెలిచినా మరో జట్టుకు ప్లే ఆఫ్‌ అవకాశాలకు గండి కొట్టే మ్యాచ్‌ ఇది. ఇప్పటికైతే ఈ రెండు జట్లకూ ప్లేఆఫ్‌ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడే జట్టు ఆ ఛాన్స్‌ను కోల్పోతుంది. ఈ రెండు జట్ల బలాబలాలను బేరీజు వేసుకుని చూస్తే.. సమతూకంగా ఉంటున్నాయి. చివరి అయిదు మ్యాచ్‌ల ఆధారంగా అంచనా వస్తే.. విజయావకాశాలు మాత్రం కింగ్స్ పంజాబ్‌కే అధికంగా ఉన్నాయి. రాజస్థాన్ పరిస్థితేమీ ఆశాజనకంగా లేదు. ఆడిన 12 మ్యాచుల్లో అయిదింట్లోనే విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం ఉన్నవి 10 పాయింట్లే. ప్లేఆఫ్‌కు చేరాలంటే.. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు ఆదివారం సాయంత్రం కోల్‌కత నైట్ రైడర్స్‌ పైనా  భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.