టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్...
అబుదాబిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 మ్యాచ్ జరుగుతున్నది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు టీం లో ఒక మార్పు చేసింది. మురుగన్ అశ్విన్ స్థానంలో గౌతమ్ ను టీమ్ లోకి తీసుకుంది పంజాబ్ జట్టు. ముంబై జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, రెండు జట్లు ఇప్పటి వరకు ఒక మ్యాచ్ మాత్రమే గెలిచాయి. రన్ రేట్ విషయంలో పంజాబ్ జట్టు ముంబై కంటే ఒకస్థానం పైన ఉన్నది. పంజాబ్, ముంబై జట్లు వరసగా 5,6 స్థానాల్లో ఉన్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలంగా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)