సింగ్ ఈజ్ బ్యాక్.. కానీ,
ఒకప్పుడు ఒంటిచేత్తో టీమిండియాకు మరువలేని విజయాలు అందించిన డాషింగ్ బ్యాట్స్‌మన్ ఐపీఎల్ 2019 వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి మాత్రం చాలా సమయమే వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. కుర్రాళ్లను హాట్ కేకుల్లా కొనేసిన ఫ్రాంచైజీలు సీనియర్లు అంటే మాత్రం ఆసక్తి చూపనేలేదని చెప్పాలి. ఈ పరిస్థితే యువరాజ్‌సింగ్‌కు ఎదురైంది... ప్రస్తుతం ఫామ్‌లో లేక విమర్శలు ఎదురుకుంటున్న యువరాజ్... పేలవ ప్రదర్శన కారణంతో టీమిండియాలోనూ స్థానం కోల్పోయాడు. మరోవైపు గత ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించలేకపోయాడు... దీంతో యువీకి ఈసారి ఐపీఎల్ వేలంలో చుక్కెదురైంది. ఐపీఎల్ వేలం తొలి రౌండ్లో యువరాజ్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపనేలేదు. కానీ, రెండో రౌండ్లో మాత్రం రూ. కోటి బేసిక్ ప్రైస్ కలిగిన యువరాజ్‌ను అదే ధరకు సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. దీంతో యువీకి కాస్త ఊరట లభించింది. ఆట అంటే ఇదేనేమో... గతంలో యువీని సొతం చేసుకోవడానికి రూ. 16 కోట్లు వెచ్చించి పోటీ పడే పరిస్థితి ఉంటే... ఇప్పుడు రూ. కోటికి పరిమితమయ్యాడు యువీ. మరి ఈ సారైనా తిరిగి ఫామ్‌లోకి వచ్చి తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన ఫామ్ చాటి సింగ్ ఈజ్ బ్యాక్ అని చాటాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)