ఇండియాలోకి రానున్న ఐ-ఫోన్ కొత్త మోడల్స్

ఇండియాలోకి రానున్న ఐ-ఫోన్ కొత్త మోడల్స్

మోబైల్ రంగంలో తన రాకతోనే ఓ కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చిన కంపెనీ ఐ-ఫోన్. ఐ-ఫోన్ చేతిలో ఉంటే చాలని ఎందరో అనుకునే చేసిందీ సంస్థ. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుందటుంది. అయితే ఇటీవల ఈ సంస్థ మరో కొత్త మోడల్‌ను ఇండియా మార్కెట్‌లోకి రిలీజ్ చేనుంది. ఈ సంస్థ కొత్త మొడల్స్‌గా ఐ-ఫోన్12, ఐ-ఫోన్12 ప్రో మొబైల్లను పరిచయం చేసింది. అయితే ఈ ఫోన్లు వచ్చే నెల ఇండియా మార్కెట్‌లో సందడి చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

 ఇక వీటి ధరలు చేస్తే.. ఐ-ఫోన్12 మొబైల్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభ్యమవుతుంది. అయితే ఇవి 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ ధర రూ.79,900గా ఉంది. అదేవిధంగా 128 జీబీ ఫోన్ ధర రూ.84,900, 256 జీబీ ఫోన్ ధర రూ.94,900 ఈ విధంగా వేరియంట్‌కు పదివేల చోప్పున ధన పెరుగింది. అయితే ఈ ఫోన్ మొత్తం 5 రంగులలో ఉంది. అవి తెలుపు, నలుపు, బ్లూ, ఆకుపచ్చ, ఎరుపు రంగులలో లాంచ్ అవ్వనుంది. ఐ-ఫోన్ 12ప్రో విషయానికి వస్తే ఇది కూడా 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో దోరకనుంది. ఐ-ఫోన్12ప్రో 128 జీబీ ధర రూ.1,19,900 కాగా 256 జీబీ ధర రూ.1,29,900, 512 జీబీ ధర రూ.1,49,900 గా ఉన్నాయి. ఇది నాలుగు రంగులలో దొరకనుంది.

వీటి స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఐ-ఫోన్12, ఐ-ఫోన్ 12 ప్రో రెండూ కూడా 6.1 అంగుళాల డిస్‌ప్లేతో ఏ14 బయోనిక్ చిప్‌తో పనిచేయనున్నాయి. అంతేకాకుండా దుమ్ము, నీటి నుంచి డ్యామేజ్ కాకుండా చూసుకునేందు ఐపీ68 వాటర్ రెసిస్టర్‌ను అమర్చారు. వీటితో పాటు 5జీ కనెక్టివిటీ, రెండు సిమ్ములు వేసుకునే సౌకర్యం, 12 మెగాపిక్సల్స్‌ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను వెనకాల ఉంచారు. దాంతో పాటుగా 12 మెగా పిక్సల్స్ సెల్ఫీకెమెరాను పొందుపరిచారు. అయితే ఐ-ఫోన్ 12ప్రో వెనకాల మూడు కెమెరలతో వస్తుంది. 12 మెగా పిక్సల్స్ కెమెరాతో రానుంది. అదేవిధంగా 12 మెగా పిక్సల్స్ సెల్ఫీకెమెరా ఉంది. వీటితోపాటు లైడార్ స్కానర్‌ కేవలం ఐ-ఫోన్ 12ప్రోలో మాత్రమే కనిపిస్తోంది.