తిరుమల వేళ్లే భక్తులకు సూచనలు..

తిరుమల వేళ్లే భక్తులకు సూచనలు..

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబర్‌ 18వ తేదీన ఉదయం 1.30 గంటలకు వీఐపీ దర్శనం.. 5.30 నుంచి సర్వ దర్శనం కల్పిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు చెప్పారు. ఇవాళ తిరుమలలో ఆయన మాట్లాడుతూ 'రెండు రోజుల్లో 44 గంటలపాటు భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తాం. 17వ తేదీ దర్శనానికి వెళ్లే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 నుంచి అనుమతిస్తాం. నడకదారి భక్తులకు 17,18,19 వ తేదీల్లో  జారీ చెయ్యం. 17,18,19,20 తేదీల్లో వయోవృద్ధలు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం ఉండదు' అని జేఈవో చెప్పారు. 

17,18వ తేదీల్లో ఘాట్ రోడ్డును 24 గంటల పాటు తెరిచి ఉంచుతామని.. సామాన్య భక్తుల కోసం మాడవీధుల్లోని గ్యాలరీలను కంపార్టుమెంట్లుగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వీఐపీలు స్వయంగా వస్తేనే బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని, సిఫారసు లేఖలను అనుమతించబోమని జేఈవో స్పష్టం చేశారు.