నాలుగో టెస్ట్ కు దూరమైన ఆసీస్ స్టార్ ఆటగాడు...

నాలుగో టెస్ట్ కు దూరమైన ఆసీస్ స్టార్ ఆటగాడు...

ఆసీస్‌- భారత్‌ల మధ్య సిరీస్‌ ప్రారంభం నుంచి  టీమిండియా నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. ఇక తాజాగా ఆస్ట్రేలియన్‌ యువ ఓపెనర్‌ విల్‌ పకోవ్‌స్కీ గాయం కారణంగా నాలుగో టెస్ట్ కు దూరం అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే విల్‌ పకోవ్‌స్కీ టీమిండియాతో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 64, 8 పరుగులు చేసి స్టార్ ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సిడ్నీ టెస్టులో ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్‌ సమయంలో పకోవ్‌స్కీ  డైవ్‌ చేయగా అతని భుజానికి బలమైన గాయమైంది. దీంతో అతను ఇరు జట్లకు కీలకంగా మారిన బ్రిస్బేన్‌ టెస్టుకు దూరమయ్యాడు.