అలాంటి మాస్కులు ధరిస్తే... రూ. 100 ఫైన్ కట్టాల్సిందే...!!

అలాంటి మాస్కులు ధరిస్తే... రూ. 100 ఫైన్ కట్టాల్సిందే...!!

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అయ్యింది.  కరోనా విజృంభిస్తున్న తొలిరోజుల్లో మెడికేటెడ్ మాస్క్ ఎన్ 95 మాస్క్ కు వాడితే కరోనాకు అడ్డుకట్ట వెయ్యొచ్చని చెప్పడంతో చాలామంది ఆ మాస్క్ లను కొనుగోలు చేశారు.  అయితే, కేంద్రం ఇటీవల రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో ఈ రకం మాస్క్ లు కరోనాను అడ్డుకట్ట వేయలేవని, వాల్వ్ ఉన్న మాస్క్ లను వాడొద్దని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.  అయినప్పటికీ చాలా మంది ఈ రకం మాస్క్ లను వినియోగిస్తుండటంతో, ఇండోర్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఎన్ 95 మాస్క్ సహా, వాల్వ్ ఉండే మాస్క్ లను నిషేదించింది.  ఈరకం మాస్కులు ధరించి బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే, రూ. 100 జరిమానా విధిస్తామని ఇండోర్ కలెక్టర్ ప్రకటించారు.