స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు ప్ర‌తికూలంగా ఉన్నా మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. రాత్రి అమెరికా మార్కెట్లు దాదాపు ఒక శాతం న‌ష్టంతో క్లోజ‌య్యాయి. నాస్ డాక్‌తో పాటు ఇత‌ర సూచీల్లో అమ్మ‌కాలు జోరుగా ఉన్నాయి. పాజిటివ్ న్యూస్ ఏదీ లేక‌పోవ‌డంతో మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు కూడా న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన చైనా మార్కెట్లు ఇపుడున‌ష్టాల్లో ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ ఒక‌శాతం దాకా న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. హాంగ్‌సెంగ్ కూడా అర‌శాతం త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు స్థిరంగా ప్రారంభ‌మై  ఇపుడు 8 పాయింట్ల లాభంతో 11062 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. మెట‌ల్స్‌లో ఒత్తిడి క‌న్పిస్తోంది. ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు వెలుగులో ఉన్నాయి. ఇక నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ప‌వ‌ర్ గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, రిల‌య‌న్స్‌, గెయిల్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా  ఉన్నాయి ఇక టాప్ లూజ‌ర్స్‌లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో ఇండియాబుల్స్ హౌసింగ్‌, వేదాంత‌, కోల్ ఇండియా, గ్రాసిం, విప్రో షేర్లు ఉన్నాయి.