కశ్మీర్ లో భారత జవాన్ ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు!

 కశ్మీర్ లో భారత జవాన్ ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు!

 జమ్మూ కశ్మీర్ కు చెందిన షకీర్ మంజూర్ భారత సైన్యంలో జవానుగా పనిచేస్తున్నాడు. కాగా 162వ బెటాలియన్ కు చెందిన షకీర్ బక్రీద్ పండుగ సెలవుల్లో ఇంటికి వెళ్ళాడు. తన ఇంటినుండి షోపియాన్ కు భయలుదేరిన షాకీర్ ఆదివారం సాయంత్రం కుల్గాం జిల్లా బోర్డర్ వద్ద కిడ్నాప్ కు గురైనట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అతడు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా కాలిపోయి  ఉండడంతోపాటు షాకీర్ ఆచూకీ లభించలేదు. దాంతో ఉగ్రవాదులే దాడి చేసి షకీర్ ను కిడ్నాప్ చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భారత సైన్యం షకీర్ ఆచూకీ కోసం వెతుకుతోంది. ఇక ఇలాంటి ఘటనలు ఇదివరకు కూడా జరిగాయి. సెలవులపై వెళ్లిన జవాన్లను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతో ఆ దిశగా అధికారులు విచారణ జరుపుతున్నారు.