గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే: ట్రైన్ బుకింగ్ ఇకపై ఈజీ... 

గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే: ట్రైన్ బుకింగ్ ఇకపై ఈజీ... 

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  ఈ సమయంలో ప్రయాణాలు చేయడం అంటే ఇబ్బందికరమైన అంశంగా చెప్పాలి.  ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంటివద్దనే ఉంటున్నారు.  రైల్వేశాఖ ఇప్పటికే  కొన్ని రైళ్లను నడుపుతున్నది.  అయితే, పూర్తి స్థాయిలో రైళ్లు తిరగడం లేదు.  రైల్వే బుకింగ్స్ కు సంబంధించి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.  

రైల్వే బుకింగ్ వెబ్ సైట్ ను ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఆధునీకరిస్తున్నట్టు రైల్వేశాఖ తెలిపింది.  2018 వ సంవత్సరంలో రైల్వేశాఖ చివరిసారిగా ఐ.ఆర్.సి.టి.సి వెబ్ సైట్ ను ఆధునీకరించింది.  కాగా, మరలా ఇప్పుడు మరోసారి ఆధునీకరిస్తున్నట్టు తెలియజేసింది.  ఆగస్టు నుంచి ఆధునీకరించి వెబ్ సైట్ అందుబాటులోకి రానున్నట్టు రైల్వేశాఖ తెలిపింది.  కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈజీగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చని చెప్తోంది రైల్వేశాఖ.