భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి... 

భారతీయ రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి... 

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఇండియన్ రైల్వే వ్యవస్థ ఒకటి.  కరోనాకు ముందు నిత్యం 13000 రైళ్లు నిత్యం పరుగులు తీస్తుండేవి.  మార్చి 22 వ తేదీ నుంచి ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి.  వలస కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించడంలో శ్రామిక్ రైళ్ల కృషి అమోగం.  

కాగా, ప్రస్తుతం దేశంలో 230 ప్రత్యేక రైళ్లు పరుగులు తీస్తున్నాయి.  కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో  సాధారణ రైళ్లను నిలిపివేశారు.  కేవలం ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.  అతి తక్కువ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఏ రైలు కూడా ఆలస్యంగా రాకూడదని, నిర్ణయించిన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలని రైల్వేశాఖ నుంచి ఆదేశాలు ఉన్నాయి.  జూన్ 23 వ తేదీన  దాదాపుగా అన్ని రైళ్లు సమయానికి చేరుకోగా ఒక్క రైలు మాత్రం ఆలస్యంగా చేరుకుంది.  అయితే, గురువారం రోజున అన్ని స్పెషల్ రైళ్లు 100శాతం ఖచ్చితమైన సమయానికి గమ్యస్థానానికి చేరుకున్నాయని,  ఇండియన్ రైల్వే చరిత్రలో ఇది అరుదైన విషయం అని రైల్వేశాఖ ప్రకటించింది.  సాధారణ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఇదే విధమైన ఫీట్ ను సాధించేలా చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ అధికారులను ఆదేశించింది.