ఈ ఏడాది రెండు వేదికల్లోనే ఐపీఎల్...?
ఐపీఎల్ 2021 కోసం మినీ వేలం పూరైంది. ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది ఐపీఎల్ ను యూఏఈ వేదికగా నిర్వహించిన బీసీసీఐ 14వ సీజన్‌ను స్వదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ లీగ్ వేదికలుగా కేవలం ముంబై, అహ్మదాబాద్‌ను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా దృష్ట్యా ఈ రెండు వేదికల్లోనే లీగ్ మొత్తం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రూప్ దశలో ముంబైలోని నాలుగు స్టేడియాల్లో.. ప్లే ఆఫ్స్, ఫైనల్‌ను అహ్మదాబాద్ మొతేరాకి కేటాయించే ఆలోచనలో బీసీసీఐ ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)