సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలు మోహరింపు... 

సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలు మోహరింపు... 

ఇండియా చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  రెండు దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నది.  ఫింగర్ పాయింట్ 3 వద్ద చైనా భారీగా బలగాలను మోహరించింది.  లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చైనా సైనికులు పదునైన ఆయుధాలతో హల్చల్ చేసిన ఫోటోలు మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.  రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా తూట్లు పొడిచి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.  అయితే, ఇండియా సంయమనం పాటిస్తూ చైనా ఆర్మీని ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు.  

ఫింగర్ పాయింట్ 3 వద్ద చైనా ఆర్మీ భారీగా బలగాలు మోహరించడంతో పాటుగా యుద్ధ ట్యాంకులను కూడా భారీ సంఖ్యలో మోహరించింది.  దీంతో ఇండియా కూడా అదే స్థాయిలో బలగాలను పెంచింది.  బలగాలను పెంచడమే కాకుండా, సుఖోయ్, మిగ్ 29 విమానాలను, రవాణా విమానాలను భారీ సంఖ్యలో బోర్డర్ లో మోహరించింది.  చైనా కదలికలను కనిపెడుతూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొంటోంది ఇండియన్ ఆర్మీ.