ఆసీస్ ఆలౌట్... క్లిన్ స్వీప్ నుంచి తప్పించుకున్న భారత్...

ఆసీస్ ఆలౌట్... క్లిన్ స్వీప్ నుంచి తప్పించుకున్న భారత్...

భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో విజయం సాధించి క్లిన్ స్వీప్ నుంచి తప్పించుకుంది భారత జట్టు. అయితే మూడు వన్డేల ఈ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది ఆసీస్. కానీ ఈ నామమాత్రపు చివరి వన్డేలో విజయం సాధించి పరువు కాపాడుకుంది టీం ఇండియా. అయితే భారత జట్టు ఇచ్చిన 303 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆటగాళ్లు ఆరోన్ ఫించ్ (75), మ్యాక్స్వెల్ (59) ధాటిగా ఆడుతూ వచ్చారు. కానీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మరో మూడు బంతుల్లో మిగులుండగానే ఆసీస్ ను 289 పరుగులకే ఆల్ ఔట్ చేశారు. ఈ మ్యాచ్ లో శార్దూల ఠాకూర్ 3 వికెట్లు, బుమ్రా, నటరాజన్ రెండు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు టాప్ ఆర్డర్ మల్లి విఫలమైంది. కోహ్లీ (63) పరుగులు చేసిన ఎవరు రాణించకపోవడంతో 152 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత వచ్చిన హార్దిక్ (92), జడేజా (66) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.