క్రీడా రంగాన్నీ వదలని కరోనా !

క్రీడా రంగాన్నీ వదలని కరోనా !

 చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ క్రీడా రంగాన్ని సైతం రచ్చ రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఈ డెడ్లీ వైరస్‌ వలన మెగా ఈవెంట్‌ ఒలింపిక్స్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఈ వైరస్ షూటింగ్‌ ప్రపంచకప్‌పైనా తన పంజా విసురుతోంది.  సైప్రస్‌లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు భారత్‌ ప్రకటించింది. మార్చి 4 నుంచి 13 వరకు సైప్రస్‌ లో ఈ టోర్నీ జరుగనుంది. అయితే కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న కొన్ని దేశాలను కేంద్ర ఆరోగ్య సంస్థ నిషేధిత ప్రయాణ జాబితాలో చేర్చింది.  ఆ లిస్ట్‌లో సైప్రస్‌ ఉంది. దీంతో ఈ మెగా టోర్నికి భారత్‌ దూరమైంది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైఫిల్‌ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ ప్రభావం ఒక్క షూటింగ్‌ రంగానికే పరిమితం కాలేదు. బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, టెబుల్‌ టెన్నిస్, బాక్సింగ్‌ వంటి క్రీడలపైనా దీని ప్రభావం ఉంది. ఇప్పటికే ఈ వైరస్‌ ధాటికి పలు టోర్నిలు రద్దయ్యాయి.