ఇంగ్లాండ్ ఆల్ ఔట్... సిరీస్ భారత్ సొంతం

ఇంగ్లాండ్ ఆల్ ఔట్... సిరీస్ భారత్ సొంతం

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4 టెస్టుల సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 205 పరుగులు చేయగా పంత్(101), సుందర్(96) కారణంగా భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 365 పరుగులు చేసి ఇంగ్లాడ్ పై 160 పరుగుల ఆధిక్యం సంపాందించింది. ఇక ఈరోజు తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ దెబ్బకు 135 కే ఆల్ ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. దాంతో ఈ టెస్ట్ సిరీస్ ను 3-1 తో సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా జూన్ లో జరిగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత సాధించింది.