రేపటి నుంచి ఆసీస్ తో నాలుగో టెస్టు...

రేపటి నుంచి ఆసీస్ తో నాలుగో టెస్టు...

రేపటి నుంచి బ్రిస్బేన్ టెస్టు మొదలు కానుంది. ఆసీస్ కు అచ్చొచ్చిన గబ్బా స్టేడియంలో ఆడాలంటే ఏ జట్టుకైనా ఇబ్బందులు తప్పవు. అలాంటిది గాయాలతో సీనియర్లుదూరమైన భారత జట్టుకు.. మరింతప్రతికూల పరిస్థితి. ఈ పరిస్థితిలో నేడు నాలుగో టెస్టుకు టీమిండియా జట్టు సభ్యుల ప్రకటన రానుంది...

ఆసీస్ ‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా.. ఆతిథ్యజట్టుకు ధీటుగా బదులిస్తోంది. తొలిటెస్టులో ఘోరమైన ఓటమిని చవిచూసిన టీమిండియా, రెండో టెస్టులో అంతే వేగంగా కోలుకుంది. ఆసీస్ జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. ఇక కీలకమైన మూడో టెస్టులో ఆసిస్‌ ఆదిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించినా.. భారత ఆటగాళ్ల వీరోచిత పోరాటంతో.. ఈ మ్యాచ్‌ డ్రా అయింది. దీంతో బ్రిస్బేన్ టెస్టు నిర్ణాయకం కానుంది.

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ 14 మంది .. గాయాలతో జట్టుకు దూరమయ్యారు. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో.. జట్టు ఎంపిక సమస్యగా మారింది. రిజర్వ్ బెంచ్ బలంగా కనిపిస్తున్నా.. వీరు సీనియర్లు లేని లోటును ఎంతవరకూ పూరించగలరన్నది అనుమానంగా మారింది. అసలే గబ్బా మైదానం, ఆపై పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆసీస్ పేసర్లను తట్టుకుని టీమిండియా బ్యాట్స్ మన్ ఎలా నిలబడతారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక కీలకమైన ఈ నాలుగో టెస్టుకోసం .. ఇవాళ టీమిండియా జట్టును ప్రకటించనుంది. క్లిష్టపరిస్థితుల్లో జట్టు బాధ్యతలను స్వీకరించిన కెప్టెన్ జింక్స్‌ చక్కనివ్యూహాలతో జట్టును ముందుకు తీసుకెళ్తుండడం.. టీమిండియాకు కలసివస్తోంది.అయితే కీలకమైన టెస్టులో సీనియర్లులేకపోవడం భారత్‌కు ప్రతికూలంశంగా చెప్పవచ్చు.